VIDEO: కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
JGL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు కొండకు తరలివచ్చారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని అలంకరించి, పూజలు, అభిషేకాలు నిర్వహించారు.