విషాదం.. ప్రాణం తీసిన మస్కిటో కాయిల్
పల్నాడు జిల్లా సత్తెనపల్లి(M) కంటెపూడిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో దోమల బెడదతో నిద్రపోయే ముందు దోమల చక్రం వెలిగించుకున్న నాగేశ్వరరావు(58) దుప్పటికి నిప్పురవ్వ అంటుకోవడంతో మంటలు వ్యాపించి సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పూర్తి వివరాలు విచారణలో వెల్లడికానున్నాయి.