భారత్‌పై సుంకాలు అంత తేలిక కాదు: ట్రంప్‌

భారత్‌పై సుంకాలు అంత తేలిక కాదు: ట్రంప్‌

భారత్‌పై 50 శాతం సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. 'భారత్‌ రష్యాకు అతిపెద్ద చమురు వినియోగదారు. ఆ దేశం నుంచి చమురు కొంటున్నారన్న కారణంతోనే నేను భారత్‌పై 50 శాతం సుంకం విధించాను. అది చాలా పెద్ద చర్య. దీంతో భారత్‌తో విభేదాలు వచ్చాయి. అయినా నేనా చర్య తీసుకున్నాను. ఇలాంటి ఎన్నో పనులు చేశాను' అని పేర్కొన్నారు.