అక్రమ మట్టి తవ్వకాలు..అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం
MLG: ఏటూరునాగారం మండలంలోని భూటారం రిజర్వ్ ఫారెస్టులో ఇష్టానుసారం మట్టి తవ్వకాలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. JCBలతో భారీగా మట్టి తవ్వి.. సమీప పెట్రోల్ బంకుకు మట్టి తరలిస్తున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. అడవుల రక్షణకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖే నిబంధనలు గాలికి వదిలేస్తోందని వాపోతున్నారు.