కొండ పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్న హర్యానా గవర్నర్

MDK: జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లో గల శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కురుమ సంఘం ఆధ్వర్యంలో దత్తాత్రేయను గొంగడితో సన్మానించారు.