నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
AKP: పరవాడ మండలంలో పలు గ్రామాలకు ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ మురళీకృష్ణ తెలిపారు. సబ్‌స్టేషన్ నిర్వహణ పనులు కారణంగా ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లంకెలపాలెం, శ్రీరామ్ నగర్, గంగిరెడ్ల కాలనీ, వినాయక నగర్, గంజిపేట, గొల్లపేట, ఇండస్ట్రియల్ ఏరియా, పెదముసిడివాడ తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.