నియోజకవర్గంలో మెరుగైన విద్యకు కృషి: వేముల

NLG: నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి మెరుగైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. కట్టంగూరు మండలం ఐటిపాముల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆదివారం రూ. 1.20 కోట్లతో నూతనంగా నిర్మించనున్న డైనింగ్ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇష్టంతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు.