పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన హిజ్రాలు

ATP: అనంతపురం లెక్చరర్స్ కాలనీ వెనుక ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ హనుమంతరాయుడు తదితరులు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని హిజ్రాలు ఆరోపించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. నగదు వెనక్కి అడిగితే బెదిరిస్తున్నారని వాపోయారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే మార్గమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.