రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
ELR: ద్వారకాతిరుమల సబ్‌స్టేషన్ సెక్షన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేద్కర్ ఆదివారం తెలిపారు. ద్వారకాతిరుమల, లక్ష్మీపురం ప్రాంతాల్లో నూతన విద్యుత్ తీగల ఏర్పాటు, లైన్ మరమ్మతుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గృహ, వ్యవసాయ అవసరాలకు సరఫరా ఉండదని వెల్లడించారు.