'హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలి'

'హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలి'

KNR: చిగురుమామిడి మండల BJP శాఖ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు పోలోజు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు హిందూ ఏక్తా యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. KNRలో ఈ నెల 22న సాయంత్రం జరిగే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేసేలా ప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన కోరారు. పెద్ద ఎత్తున మండల ప్రజలు తరలివచ్చేలా త్వరితగతిన ఏర్పాట్లు చేసుకోవాలని నాయకులకు సూచించారు.