అభివృద్ధి కోసం కాంగ్రెస్ గెలుపు అవసరం: నాగరాజు
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ లో 12 వార్డుల నాయకులతో నేడు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమావేశం నిర్వహించి, పట్టణ అభివృద్ధి, ఆరోగ్యం, విద్య,సాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యంపై చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. ఆయన, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, ప్రజల అవసరాలను తీర్చడంలో విఫలమయ్యాయని విమర్శిస్తూ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.