పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం
NRPT: మందిపల్లి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని సర్పంచ్ సురేందర్ రెడ్డి కొనియాడారు. మంగళవారం పంచాయతీ కార్యదర్శి జ్యోతితో కలిసి కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి, నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా గ్రామస్థులు అభినందించారు.