చికిత్స పొందుతూ యువకుడు మృతి

చికిత్స పొందుతూ యువకుడు మృతి

అన్నమయ్య: సామగుంటవారిపల్లె వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్తాఫ్ (20) అనే యువకుడు మృతి చెందాడు. పెట్రోలు క్యాన్ కారణంగా మంటలు చెలరేగి అతను తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యాడు. తమిళనాడులో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.