మహిళా సంఘాలకు మంత్రి శుభవార్త
MLG: జిల్లా మహిళా సంఘాలకు మంత్రి సీతక్క శుభవార్త ఇవాళ చెప్పారు. రానున్న మేడారం జాతర సమయంలో వేలాది మంది భక్తులు జాతరకు వస్తారని, ఈ సందర్భంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఫుడ్ కోర్ట్స్, దుకాణాలు, వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.