'ప్రభుత్వంలో ఎస్సీలకు ఒరిగిందేమీ లేదు'

BPT: కూటమి ప్రభుత్వం హయాంలో ఎస్సీలకు ఒరిగిందేమీ లేదని అద్దంకి నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు రోశయ్య సోమవారం తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్న ఎస్సీలకు ప్రయోజనం ఏమి కలగలేదని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోమని చెప్పినప్పటికీ ఇంతవరకు అతిగతి లేదని రోశయ్య విమర్శించారు.