మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలోని ఓ టాలెంట్ స్కూల్ లీడ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, కాలుష్యం, సోషల్ మీడియాపై విద్యార్థులతో ప్రజలకు అవగాహన కల్పించారు. పాఠశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. 3 అంశాలపై ఉపన్యాసాలు, నాటకాల ద్వారా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.