'విద్యార్థుల ప్రాణాలంటే అధికారులకు ప్రేమ లేదు'
GDWL: ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవ్వడంపై పీడీఎస్‌యూ, పీవైఎల్, తదితర విద్యా సంఘ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రాణాలంటే అధికారులకు కనీస ప్రేమ లేకపోవడం స్పష్టమవుతోందని నాయకులు మండిపడ్డారు.