వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మూసాపేట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.  రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.