పదోన్నతులు ఉత్సాహాన్ని ఇస్తాయి: ఎస్పీ

పదోన్నతులు ఉత్సాహాన్ని ఇస్తాయి: ఎస్పీ

NRPT: పదోన్నతులు ఉద్యోగుల బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. కానిస్టేబుల్‌గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన శివారెడ్డికి గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బ్యాడ్జి తొడిగించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులు ఉత్సాహాన్ని ఇస్తాయని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ఉన్నతాధికారులు మన్ననలు పొందాలని చెప్పారు.