VIDEO: ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
NLR: నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. నెల్లూరు వైపు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన 22 మంది ప్రయాణికులు కిందకి దిగేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలు ఆర్పేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటికి దిగేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.