'వేతనాలు సకాలంలో చెల్లించాలి'

'వేతనాలు సకాలంలో చెల్లించాలి'

WNP: ఆశావర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆశావర్కర్ల జిల్లా అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ పట్టణంలోని గాంధీనగర్ పీహెచ్‌సీ ముందు యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాచేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూలై నెల వేతనాలు ఇప్పటికి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.