కాజీపేట దర్గాను సందర్శించిన సీపీ

కాజీపేట దర్గాను సందర్శించిన సీపీ

HNK: కాజీపేటలోని బియాబాని ఉత్సవాలను పురస్కరించుకొని సీపీ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్త్‌ను సీపీ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తూ చర్యలు చేపట్టాలని సీపీ అధికారులను అదేశించారు.