మూలపేట పోర్టు పనులను పరిశీలించిన మంత్రులు
AP: శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల కోరికైన మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులను మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ ఏడాది చివరికల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రోడ్డు, రైల్వే లైన్ పనులను పట్టించుకోకపోవడం వల్లే ఆలస్యమైందని, ప్రస్తుతం 74% పనులు పూర్తయ్యాయని మంత్రులు పేర్కొన్నారు.