ద్రాక్ష లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా

E.G: దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద ద్రాక్ష లోడ్‌తో వెళ్తున్న డీసీఎం లారీ బోల్తా పడింది. తమిళనాడు నుంచి రాజమండ్రికి వెళ్తున్న ఈ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ బోల్తా పడిన సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.