దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన ఎంపీ

దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన ఎంపీ

కోనసీమ: ముమ్మిడివరంలో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత మే నెలలో ముమ్మిడివరం నియోజకవర్గం వారీగా పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన 832 రకాల ఉపకరణాలు నేడు అందించారన్నారు.