అలర్ట్.. జిల్లాకు వర్ష సూచన
NLG: జిల్లా ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి ఆరు రోజుల పాటు జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈనెల 21వ తేదీ వరకు వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. దీంతో ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష సూచనతో జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.