'మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాం'
MDCL: ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని MLA కేపీ వివేకానంద్ అన్నారు. జగద్‌గిరిగుట్ట డివిజన్ భూదేవి హిల్స్ ఓనర్స్ వెల్‌ఫేర్ సొసైటీ సభ్యులు కుత్బుల్లాపూర్‌లోని MLA నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. భూదేవి హిల్స్ ఏ బ్లాక్ వద్ద గల భూగర్భ డ్రైనేజీ సమస్యపై వినతి పత్రం అందించారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.