'ధాన్యం రోడ్లపై ఆరబోయవద్దు'
SRPT: రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నదని, ఎస్పీ నరసింహ తెలిపారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఏల్కారం గ్రామం టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సోమవారం రాత్రి సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం రైతులకు అవగాహన కల్పించారు.