VIDEO: తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు
కర్నూలు జిల్లా ఆలూరులోని మొలగవల్లి కొట్టాలలో మంచి నీటి కోసం అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగడానికి నీరు లేక 45 రోజులు అవుతున్నా, కూటమి ప్రభుత్వ పట్టించుకోవటం లేదన్నారు. చుక్కనీటి కోసం రాత్రింబవళ్లు నీటి కొళాయి దగ్గరే పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.