తొట్టంబేడు ఎస్సైగా వెంకటరమణ బాధ్యతలు

తొట్టంబేడు ఎస్సైగా వెంకటరమణ బాధ్యతలు

TPT: తొట్టంబేడు ఎస్సైగా వెంకటరమణ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్సై‌ బలరాంను వీఆర్‌కు  బదిలీ చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.