పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గర్వంద శ్రీనివాస్ (40) అనే డ్రైవర్ గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. శ్రీనివాస్ పలువురి దగ్గర రూ. 5లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పుల బాధతో ఈనెల12న శ్రీనివాస్ పురుగుల మందుతాగి ఆత్మహత్యయత్నం చేశాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.