VIDEO: వినూత్నంగా ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
TG: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టడంతో బస్సులన్నీ ఆయా డిపోలకే పరిమితమయ్యాయి. అయితే, ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలోని బస్సు డిపో ఎదుట బతుకమ్మ ఆడి తమ సమస్యలను తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ మహిళా కార్మికులు కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.