అకాల వర్షం.. స్తంభించిన జనజీవనం

అకాల వర్షం.. స్తంభించిన జనజీవనం

AP: అకాల వర్షానికి రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు కాలనీల్లో వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరి ధాన్యం, దుస్తులు తడిసి పోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రహ్మ సముద్రం మండలం సుగేపల్లికి వెళ్లే రోడ్డు కోతకు గురైంది. అత్యధికంగా రాప్తాడులో 14.2 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది.