మాంచో ఫెర్రర్‌ను కలిసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
సత్యసాయి: జిల్లాలో విద్య, ఆరోగ్యం, క్రీడలు, అభివృద్ధి అంశాల్లో పేదల జీవితాల్లో ఆనందాలు నింపుతున్న ఆర్డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌కు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే రాజు, మాంచో ఫెర్రర్‌ను కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.