గాలికుంటు వ్యాధి నిరోధకాల టీకా పోస్టర్ ఆవిష్కరణ
NTR: జిల్లాలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని 1,93,050 పశువులకు టీకాలు వేయాలనే లక్ష్యంతో 34 బృందాలను ఏర్పాటు చేశారు. నాలుగు నెలలు దాటిన ప్రతి ఆవు, గేదెకు తప్పనిసరిగా టీకా వేయాలని రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.