అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర చిరుత సంచారం.?

TPT: అలిపిరిసమీపంలో మరోసారి చిరుతసంచారం కలకలం రేపింది. శుక్రవారం జూపార్క్ రోడ్డునుంచి అలిపిరి టోల్ గేట్ మీదుగా అటవీప్రాంతంలోకి వెళుతున్న చిరుతను సెక్యూరిటీ సిబ్బంది చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతలు ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నట్లు సమాచారం. కాగా, ఏప్రిల్ 6వ తేదీన వేదిక్ యూనివర్శిటీలో ఓ చిరుతను బోనులో బంధించి చిట్వేల్ అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.