'ఈనెల 26న జాతీయ మహిళా కమిషన్ పబ్లిక్ హియరింగ్'

VSP: ఈనెల 26న జాతీయ మహిళా కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మజుందార్ దీనికి అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ మహిళా కమిషన్‌కు వినతులు ఇవ్వాలని కోరారు.