VIDEO: బంక్ ముందు బారులు తీరిన మున్సిపల్ వాహనాలు
WGL: గ్రేటర్ WGL మున్సిపల్ పరిధిలోని డివిజన్‌లలో చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్‌లు, టిప్పర్‌లు ఇవాళ డీజిల్ కోసం సెంట్రల్ జైలు పెట్రోల్ బంక్ ఎదుట బారులు తీరాయి. బంక్‌కు బల్దియా రూ.2.50 కోట్ల బకాయిలు పడటంతో గత వారం రోజులుగా డీజిల్ సరఫరా ఆగిపోయింది. గతంలో బంక్ నుంచి డీజిల్ పొందగా, ఇప్పుడు మేయర్ బంక్ అధికారులను ఒప్పించడంతో డీజిల్ కోసం వాహనాలు క్యూ కట్టాయి.