గంజాయి మత్తులో యువకుల హంగామా
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో రాత్రి వేళలో గంజాయి మత్తులో యువత వీరంగం సృష్టిస్తున్నారు. షాపులు, వాహనాలపై రాళ్లతో దాడి చేస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.