తాగునీటి సమస్యపై MDOకు వినతి

VZM: పురిటిపెంటలో తాగునీటి సమస్యపై గజపతినగరం మండల BJP అధ్యక్షులు భాస్కరరావు మంగళవారం డిప్యూటీ MDO చల్లా సుగుణాకర్ రావుకు వినతిపత్రం అందజేశారు. పురిటిపెంట షరాబుల కాలనీలో తాగునీటి సమస్య ఉందని జల్ జీవన్ యోజన పథకం అమల చేసి ప్రజలకు తాగునీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి తవుడు, ఉపాధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.