VIDEO: గాంధీపార్క్ ఖాళీ చేయాలి: సీపీఐ నిరసన
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గాంధీపార్క్‌లో ఉన్న తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను ఖాళీ చేసి, నూతనంగా నిర్మించిన మార్కెట్‌కు తరలించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గాంధీ విగ్రహం ఎదుట జరిగిన ఈ ఆందోళనలో నాయకులు పాల్గొని మాట్లాడారు. గాంధీపార్క్‌ను ప్రజలకు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.