141 డయేరియా కేసులు వచ్చాయి: మంత్రి

AP: విజయవాడలో ఇప్పటివరకు 141 డయోరియా కేసులు వచ్చినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఎలాంటి మరణాలు లేవని స్పష్టం చేశారు. డయేరియా కేసులు ముందే గుర్తించి ప్రజలను, అధికారులను అలర్ట్ చేసినట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలు చేసి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రెండో విడత టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.