ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: ఆరోగ్యమే మహా భాగ్యమని, మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం మెంటేవారితోటలో వండర్ కిడ్స్ స్కూల్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.