జిల్లాలో 68 సర్పంచ్ స్థానాలకు పోటీ
గద్వాల జిల్లాలోని అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లో ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ప్రచార గడువు నేటితో ముగిసింది. ఈ ఐదు జీపీల్లో 638 వార్డులు, 68 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,00,372 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.