చేజర్లలో పొంగి పొర్లుతున్న పందల వాగు

NLR: చేజర్ల నుంచి సంగం వెళ్లే రోడ్డు మార్గంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గొల్లపల్లి వద్ద పందల వాగు పొంగిపొర్లింది. వాగులోకి భారీగా నీరు వచ్చి చేరడంతో రోడ్డు మీదుగా ప్రవహిస్తుంది. ఈ కారణంగా వాహనాలు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారులు తాత్కాలికంగా ఇతర మార్గాలు ఎంచుకోవాల్సిన వస్తుంది.