విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయం ప్రారంభం
VSP: జోన్ - 4 కార్యాలయం మొదటి అంతస్థులో దక్షిణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకు మెరుగైన సదుపాయాలు, జీవన ప్రమాణాన్ని పెంచడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించారని ఎమ్మెల్యే తెలిపారు.