బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు
PLD: చిలకలూరిపేట RTC బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా వాడుకలో ఉన్న నడక దారిని మూసివేశారు. దీంతో వృద్ధులు, మహిళలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. బస్టాండ్ లోపల అదనంగా బైక్ స్టాండ్లు ఏర్పాటు చేయడంతో బస్సుల రాకపోకలకు ఆటంకం ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై డీఎం వేణుబాబు స్పందిస్తూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు.