'డీజేలు పెడితే కఠిన చర్యలు'

NGKL: జిల్లా కేంద్రంలోని గణేష్ కమిటీ నిర్వాహకులకు డీజేలు పెడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వై అశోక్ రెడ్డి హెచ్చరించారు. సీఐ మాట్లాడుతూ.. నిమజ్జనం చేసే సమయంలో డీజేలు పెట్టొదన్నారు. డీజేలకు అనుమతి లేదని, శాంతియుతంగా కోలాటం చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నిమజ్జనం అతి తక్కువ సమయంలో పూర్తిచేయాలని పోలీస్ వారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.