కానిస్టేబుల్ శిక్షణ ఏర్పాట్లు పరిశీలించిన SP
KDP: ఇటీవల నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్స్‌కు త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప నగర శివారులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎస్పీ నచికేత్ పరిశీలించారు. అక్కడ శిక్షణ కేంద్రంలోని తరగతి గదులు, మైదానం, కిచెన్ తదితరాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.