బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉమ్మడి జిల్లా నేతలు
WGL: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాణిరుద్రమ, దశమంతరెడ్డి, వన్నాల వెంకటరమణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నియమించారు. పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని, రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వారికి రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు.